bhimadoludays.suryatoons.com

Bhimadole Railway Station Memories

Bhimadole-Railway-Station

మావూరి రైల్వే స్టేషన్ – మరపురాని రిక్రియేషన్ ! మా భీమడోలు రైల్వే స్టేషన్ చూడ్డానికి చిన్నగా, మమూలుగా వున్నా, రెండు ప్రత్యేకతలు కలిగి వుంది. ఒకటి: హైవే కి ఆనుకొనివుండడం, దీనివల్ల రోడ్డు రవాణా / రైలు రవాణా సరుకు అటు ఇటు మార్చుకోడానికి అనుకూలంగా వుండేది. ఇక ఊరు ప్రయాణాలకైతే, పొరపాటున రైలు మిస్ ఐనా..కంగారు పడకుండా, నాలుగడుగులు వేసి హైవే ఎక్కితే, బస్సో, లారీనో ఎక్కి, ఎటైనా  లాగించేయడానికి ఈజీ గా వుండడం. […]

Bhimadole Godavari Canal Memories

Bhimadole-Godavari-Canal

గోదారి కాలువలో గోచీలాట ! మా గోదారి కాలువ గట్టు..రూటే సపరేటు..! ఎలా అంటారా..సాధారణంగా ఊరంటే రోడ్డుకి ఆ పక్క – ఈ పక్కా విస్తరించి వుంటుంది. కానీ మా వూరు మాత్రం హైవే కి ఒక పక్క మాత్రమె వుంటుంది. మరోపక్క ఊరందరి భోజనానికి వడ్డించిన పచ్చని విస్తరాకులా, వరి పంట పొలాలూ, మధ్యలో మనకు పొలమారకుండా, పొలాలకు తడారకుండా నిండుగా ప్రవహించే గోదారమ్మ నీళ్ళు, మరో పక్క, భోజనం తర్వాత సేద తీర్చడానికి, రైల్వే […]

Eluru to Bhimadole Canal Road

Bhimadole-Canal-Road

కాలువ గట్టు రోడ్ కీ.. రైట్..రైట్ ! ఏలూరు To తణుకు, తాడేపల్లిగూడెం వైపు వెళ్ళే బస్సు అంటే, మావూరు కాలువగట్టు వైపు వెళ్ళే బస్సు బయలుదేరుతుండగా ఎక్కేసాను. ఎదో ఒక విండో సీటు కోసం వెదుకుతుండగా -లక్కీగా ముందు డ్రైవర్ సీటు పక్కనే ఉన్న సీటు దొరికింది. ” ఆహ దీని తస్సాదియ్యా !..ఇప్పుడు ఒక పక్కేంటి ఆ పక్క గోదావరి కాలువ, పంట పొలాలు, ఈ పక్క పచ్చని చెట్లూ – హైవే తో […]

Hyderabad to Bhimadole Via Eluru

bhimadoludays.suryatoons.com-eluru-bus-stand

మా ఊరికి రెండు రహదార్లు ! ఏలూరు కొత్త బస్టాండ్, అన్నయ్య గారి అబ్బాయి శ్యాం, శనివారపు పేట ఇంటినుంచి బండిమీద డ్రాప్ చేసి ” Ok బాబాయ్ – వెళ్లి మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి రండి – బాయ్ ” అంటూ వెళ్ళిపోయాడు. అప్పటికే పెద్ద పండక్కి వచ్చినవారు ఊళ్ళకి చేరుకున్నారు కాబట్టి ప్రయాణాలు తగ్గి, బస్టాండ్ లోపల జనం మరీ ఎక్కువగా కాకుండా ఓ మాదిరిగా వున్నారు. వాస్తవానికి నేనుకూడా పండక్కి […]

Chintalapudi to Bhimadole Night Journey

bhimadolu-days-story-surya-001

పోలీసోరి అబ్బాయి      అది 1975వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామం, పోలీస్ కానిస్టేబుల్ కృష్ణ ప్రసాద్ గారి ఇల్లు.. ఆయనకు చింతలపూడి నుంచి భీమడోలు ట్రాన్స్ఫర్ కావడంతో కుటుంబమంతా ప్రయాణానికి సిద్ధమయ్యారు. భార్య – ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్లతో, ఇల్లంతా సామాన్లు సర్దేసి, లారీ కోసం ఎదురుచూస్తున్నారు. లారీ వచ్చేలోపు మరోసారి చుట్టుపక్కల వారికి వీడ్కోలు చెబుతూ మాటల్లోపడింది వారి భార్య భవానీ. అలా వారు భీమడోలు వెళ్లిపోతున్నందుకు, అందరికంటే […]